: గౌహతి ఎక్స్‌ ప్రెస్‌ లో మంటలు


బెంగళూరు నుంచి గౌహతి వెళ్లే గౌహతి ఎక్స్‌ ప్రెస్‌ (12509)లో సోమవారం ఉదయం జనరల్ బోగీ వద్ద స్వల్పంగా మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి 11:30 గంటలకు బెంగళూరులో బయలుదేరిన రైలు నేటి ఉదయం 7 గంటలకు చెన్నై దాటింది. రైలు నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన తరువాత మంటలు వస్తున్నట్టు గుర్తించి, దొరవారి సత్రం మండలం పోలిరెడ్డి పాలెం వద్ద రైలును నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. జనరల్ బోగీ బ్రేక్స్ వద్ద మంటలు వ్యాపించాయని, మరమ్మతు అనంతరం రైలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. కాగా, సుమారు 2 గంటల నుంచి రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News