: దంపతులైనా సరే... వెళ్లకతప్పదు... తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగులపై పిడుగు!


తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా విడుదల చేసిన ఉద్యోగుల విభజనపై మరిన్ని మార్గదర్శకాలు వారికి తీరని ఆవేదనను మిగల్చనున్నాయి. వివిధ పోస్టుల్లో పూర్తిస్థాయిలో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని, ఒకవేళ 'ఐచ్ఛికం' ఇచ్చినా సొంతరాష్ట్రానికి వెళ్లకతప్పదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌ లు ఆదేశాలు జరీ చేశారు. దంపతులిద్దరూ రాష్ట్రస్థాయి పోస్టుల్లో పనిచేస్తున్న స్థానికేతరులైతే వారు తమ సొంత రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల్లోని ఉప కులాలను ఏ రాష్ట్రం ప్రకటిస్తే ఆ రాష్ట్రానికే ఆయా ఉద్యోగులు నియమితులవుతారని తెలుపుతూ, పక్క రాష్ట్రంలో ఉంటామని ఐచ్ఛికాన్ని ఇచ్చినా పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగి జీవిత భాగస్వామి సివిల్ సర్వీస్ అధికారి అయ్యుంటే అతను/ఆమె ఏ రాష్ట్రంలో పనిచేస్తుంటారో అదే రాష్ట్రానికి ఆ ఉద్యోగిని కూడా నియమిస్తారు. ఒకవేళ దంపతులిద్దరూ రాష్ట్రస్థాయి పోస్టుల్లో పనిచేస్తూ ఇద్దరూ తమ రాష్ట్రాన్ని కోరుకొంటే దాన్నే కేటాయిస్తారు. స్థానికేతరులైతే సొంత రాష్ట్రానికి మాత్రమే పంపుతారు.

  • Loading...

More Telugu News