: ఒకే సిరంజీతో 30 మందికి ఇంజక్షన్... నీలోఫర్ నర్సుల నిర్వాకంతో చిన్నారులకు అస్వస్థత


సౌకర్యాల లేమితో పెద్ద సంఖ్యలో చిన్నారుల మరణానికి కారణమైన హైదరాబాదులోని నీలోఫర్ ఆస్పత్రి మరోమారు వార్తల్లోకెక్కింది. ఈ సారి సదరు ఆస్పత్రి వార్తల్లోకెక్కడానికి సౌకర్యాల కొరత ఎంతమాత్రమూ కాదు. కేవలం నర్సుల నిర్వాకంతోనే ఆ ఆస్పత్రి ఈ దఫా వార్తల్లో పతాక శీర్షికకెక్కింది. వివరాల్లోకెళితే... ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో ఐదేళ్ల లోపు వయస్సున్న 30 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరికి వైద్యులు నిర్దేశించిన ప్రకారం నర్సులు ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంది. ఆదివారం రాత్రి అక్కడ విధులు నిర్వర్తించిన నర్సులు ఒకే సిరంజీతో మొత్తం 30 మంది చిన్నారులకు ఇంజక్షన్ ఇచ్చారు. దీంతో మందు వికటించి చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కొందరు చిన్నారుల చేతులు వాచిపోగా, మరికొందరికి రక్తం గడ్డకట్టింది. ఈ నేపథ్యంలో నొప్పితో చిన్నారులు ఏడుపు లంకించుకున్నారు. పరిస్థితిని గమనించిన చిన్నారుల తల్లిదండ్రులు నర్సులను నిలదీయగా అసలు విషయం బయటపడింది.

  • Loading...

More Telugu News