: ఎయిర్ అంబులెన్స్ లో స్టార్ హీరో కుమార్తెను తీసుకెళ్లారు


డబ్బుంటే కొండమీద కోతి అయినా కాళ్ల ముందు నిలబడుతుందనే దానికి నిదర్శనంగా నిలిచే సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ రాజస్థాన్ లోని షూటింగ్ సందర్భంగా అస్వస్థతకు గురైంది. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకన్ గా పేరొందిన సోనమ్ కు పరీక్షలు చేయగా స్వైన్ ఫ్లూ సోకినట్టు తేలింది. ఆమె ఫిట్ నెస్ ట్రైనర్ కు కూడా స్వైన్ ఫ్లూ సోకడంతో ఆయన నుంచే సోనమ్ కు అంటుకుని ఉంటుందని అంతా భావిస్తున్నారు. సోనమ్ కు స్వైన్ ఫ్లూ అని తెలియగానే ఆమె తల్లి సునీత హుటాహుటీన రాజస్థాన్ బయల్దేరారు. తక్షణం తన కుమార్తెను ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేర్చారు. హీరోయిన్ సోనమ్ కపూర్ ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ గారాలపట్టి కావడం విశేషం.

  • Loading...

More Telugu News