: భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న పాక్ సింగర్


భారత్ లో తన అద్భుతమైన ప్రతిభతో అభిమానుల్ని సంపాదించుకున్న పాకిస్థానీ గాయకుడు అద్నాన్ సమీ భారతీయ పౌరసత్వం కోసం మరోసారి దరఖాస్తు చేశారు. రెండేళ్ల క్రితం ఆయన భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయగా ప్రభుత్వం తిరస్కరించింది. 43 ఏళ్ల సమీ భారత హోం మంత్రిత్వ శాఖ విదేశీయుల విభాగంలో తన దరఖాస్తును సమర్పించారు. ఆయన దరఖాస్తు పరిశీలనలో ఉందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయనకు పౌరసత్వం ఇవ్వవచ్చా? లేదా? అని హోం మంత్రిత్వ శాఖ న్యాయశాఖను సలహా అడిగినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News