: శీలానికి లక్ష ఖరీదు కట్టి...భ్రూణ హత్యకు పాల్పడ్డారు


బాలికను గర్భవతిని చేశాడో కామాంధుడు, వాడు చేసిన తప్పుకు లక్ష ఖరీదు కట్టి పెద్దలమనిపించుకున్నారు మరికొంతమంది దుర్మార్గులు. జరిగిన దారుణానికి సాక్ష్యాన్ని హత్యచేసి తమ కిరాతకాన్ని నిరూపించుకున్నారు. మెదక్ జాల్లా తోగుంట సీఐ కథనం ప్రకారం... గజ్వేల్ మండలంలోని మక్తమాసాన్ పల్లి గ్రామానికి చెందిన పెంజర్ల శివాజీ (16) కుటుంబీకులకు చెందిన పొలంలోకి అదే గ్రామానికి చెందిన బాలిక (17) చిక్కుకుడు కాయలు ఏరేందుకు పనికి వెళ్లింది. ఈ సందర్భంగా శివాజీ మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు. దీంతో బాలిక గర్భందాల్చింది. బాలిక ఫిబ్రవరి 23న పంచాయతీ పెట్టించింది. 24న బాలిక శీలానికి లక్ష రూపాయలు ఖరీదు కట్టి అబార్షన్ చేయించుకోవాలని తీర్పునిచ్చారు. దీంతో శివాజీ సోదరుడు రాజు, బావ మేస్త్రీ శ్రీను, సోదరి రాణెమ్మలు గజ్వేల్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అబార్షన్ చేయించారు. ఈ దారుణం వెలుగుచూడడంతో శివాజీ, రాజు, శ్రీను, రాణెమ్మ, డాక్టర్ సాంబశివరావులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

  • Loading...

More Telugu News