: పోలవరం ఆంధ్రప్రదేశ్ కు గుండె లాంటిది: ఉండవల్లి
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెకాయలాంటిదని ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అలాంటి పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. బిల్లులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే, ఇప్పటి వరకు దానికి 5 వేల కోట్లు ఖర్చయ్యాయని ఆయన చెప్పారు. దానిని మూడు, నాలుగు ఏళ్లలో పూర్తి చేయాలంటే ఏడాదికి 4 నుంచి 5 వేల కోట్లు విడుదల చేయాలని ఆయన సూచించారు. అలాంటిది బీజేపీ కేవలం వంద కోట్లు విదిల్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు రాయలసీమకు నీరిస్తామంటున్నారు...పోలవరం పూర్తి కాకుండా ఎలా ఇస్తారని ఆయన నిలదీశారు. కేవలం పోలవరం ప్రాజెక్టును ఆపేసేందుకు ఇతర నదుల నీరును ఎత్తిపోతల పథకాల్లో ఇస్తామంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం మొత్తానికి నీరందించే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోతే తెలుగు జాతి యావత్తూ నేతలను క్షమించదని ఆయన హెచ్చరించారు.