: 32 వేల ఎకరాలు సేకరించాం... 1500 ఎకరాలు సేకరించాల్సి ఉంది: పుల్లారావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి 32 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించిందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నిర్దేశించిన మేరకు మరో 1500 ఎకరాలను సేకరించాల్సి ఉందని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా, రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకు వచ్చారని ఆయన చెప్పారు. చివరి రోజున రైతులు పోటెత్తడంతో తాము నిర్దేశించుకున్న లక్ష్యం చేరామని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో రైతుల పాత్ర మరువలేమని ఆయన తెలిపారు.