: పదవులపై తీపి, ప్రేమ ఉంటే రాష్ట్రానికి న్యాయమెలా జరుగుతుంది?: చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్యే విసుర్లు


కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, విశాఖ తూర్పు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఘాటుగా స్పందించారు. పదవులపై తీపి, ప్రేమ ఉంటే... రాష్ట్రానికి న్యాయమెలా జరుగుతుందని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిన తీరుపై నరేంద్ర మోదీ సర్కారుపై చంద్రబాబు నిన్న అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలపై వెనువెంటనే స్పందించిన విష్ణుకుమార్ రాజు, 'అసలు మనకేం కావాలో కేంద్రాన్ని అడిగామా?' అంటూ ప్రశ్నించారు. డిమాండ్ల సాధన కోసం వినతి పత్రాలిచ్చి చేతులు ముడుచుకుని కూర్చుంటే సరిపోదన్న రాజు, వాటిని నెరవేర్చుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు కలిసి ఒక టీంగా ఏర్పడి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను కలుద్దామంటూ రాజు సూచించారు.

  • Loading...

More Telugu News