: రింగు రోడ్డుపై నిలిచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... జాగారం చేసిన ప్రయాణికులు


ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. నిండా ప్రయాణికులతో నిన్న రాత్రి ముంబై బయలుదేరిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు, కనీసం హైదరాబాదును కూడా దాటలేకపోయింది. మెదక్ జిల్లా ముత్తంగి సమీపంలోని ఔటర్ రింగు రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో రాత్రి నుంచి ప్రయాణికులు రింగు రోడ్డుపైనే జాగారం చేస్తున్నారు. బస్సు నిలిచిపోయిన విషయం తెలుసుకున్న యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అసలు బస్సు ఏ కారణంతో నిలిచిపోయిందన్న విషయం కూడా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News