: పవన్ కల్యాణ్ నిర్మాతగా రామ్ చరణ్ కొత్త సినిమా!


పవన్ కల్యాణ్ ఇటీవలే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరిట ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా, తన బ్యానర్ పై రామ్ చరణ్ హీరోగా సినిమా నిర్మించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. దీనికి సంబంధించి మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బాబాయి నిర్మాణంలో అబ్బాయి సినిమా వాస్తవరూపం దాల్చితే మాత్రం అది మెగా ఫ్యాన్స్ కు పండుగే. ఇటీవల చిరంజీవి, నాగేంద్రబాబు కుటుంబాలతో పవన్ కల్యాణ్ దూరం పాటిస్తున్నాడని, విభేదాలున్నాయని కథనాలు వచ్చాయి. ఇప్పుడీ వార్తతో వారి మధ్య సఖ్యత ఉన్నదని భావించవచ్చేమో!

  • Loading...

More Telugu News