: బండ పడింది... భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు


పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్ పై రూ.3.18, డీజిల్ ధర లీటర్ పై రూ.3.09 పెంచారు. కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయించాయి. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నెల 15న కూడా పెట్రో ధరలను స్వల్పంగా పెంచిన సంగతి విదితమే. అప్పుడు పెట్రోల్ ధర లీటర్ పై 82 పైసలు, డీజిల్ ధర లీటర్ పై 61 పైసలు పెంచారు. ఈసారి మాత్రం కాస్త ఎక్కువగానే పెంచడం గమనార్హం.

  • Loading...

More Telugu News