: కేంద్ర బడ్జెట్ ను జీర్ణించుకోలేకపోతున్నా... చాలా బాధాకరం: చంద్రబాబు


ఈరోజు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ పై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడ్జెట్ ను ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నానని స్పష్టం చేశారు. బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని... రాష్ట్ర సమస్యలను కొన్నింటినైనా తీరుస్తారని భావించామని... అయితే తమ ఆశలన్నింటినీ, అడియాశలు చేశారని అన్నారు. ఇది చాలా బాధాకరమని చెప్పారు. బడ్జెట్ తో తామే కాకుండా, రాష్ట్ర ప్రజలంతా తీవ్ర నిరాశ, నిస్పృహలోకి వెళ్లారని అన్నారు. ప్రజల నమ్మకాలన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు.

  • Loading...

More Telugu News