: బడ్జెట్ లక్ష్యాలు బాగున్నాయి... కానీ, సరైన ప్రణాళికే లేదు: మన్మోహన్ సింగ్


ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. బడ్జెట్ లో మంచి లక్ష్యాలే ఉన్నాయిగానీ, సరైన రోడ్ మ్యాపే (ప్రణాళిక) లేదని ఓ ఆంగ్ల ఛానల్ తో పేర్కొన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అయిన మన్మోహన్ ఈ మేరకు మాట్లాడుతూ, యూపీఏ హయాంలో వ్యవసాయం చాలా బాగుందని, గతేడాది వ్యవసాయ సంబంధిత ఆర్థిక వ్యవస్థలో ఒత్తిడి, అలసట సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనే విధంగా బడ్జెట్ లేదని చెప్పారు. 70 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని, వారి అభివృద్ధికి ఎలాంటి ప్రతిపాదనలు లేవని విమర్శించారు. మొత్తానికి బడ్జెట్ నిరాశాజనకంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News