: కూన కుదేల్... టీమిండియా హ్యాట్రిక్


టీమిండియా హ్యాట్రిక్ కొట్టింది. వరల్డ్ కప్ లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. పెర్త్ లో ఏకపక్షంగా సాగిన పోరులో టీమిండియా 9 వికెట్ల తేడాతో పసికూన యూఏఈని చిత్తుగా ఓడించింది. 103 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (57 నాటౌట్), విరాట్ కోహ్లీ (33 నాటౌట్) రాణించారు. అంతకుముందు, యూఏఈ జట్టు భారత బౌలర్ల ధాటికి 102 పరుగులకు ఆలౌటైంది. షాయిమాన్ అన్వర్ (35) టాప్ స్కోరర్. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 4, జడేజా 2, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీశారు. యూఏఈ పతనంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ లో పాక్ ను చిత్తు చేసిన ధోనీ సేన, రెండో మ్యాచ్ లో సఫారీలను మట్టికరిపించడం తెలిసిందే. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ తన స్థానాన్ని మరింత పటిష్ట పరుచుకుంది.

  • Loading...

More Telugu News