: నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ఎంపిక
ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ఏర్పాటు చేయనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆప్టికల్ ఫైబర్ తో 1.20 కోట్ల ఇళ్లకు నెలకు రూ.150తో బ్రాడ్ బాండ్ కనెక్షన్ ఇవ్వనున్నారు. ఐదేళ్లలో ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ కోసం రూ.4913 కోట్ల వ్యయం చేయాల్సి ఉంది. దానికోసం కేంద్రం రూ.1940 కోట్లు భరించనుంది. ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు.