: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా భట్టి నియామకం


తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఈ రోజు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి పొన్నాల లక్ష్మయ్యను తొలగించిన కాంగ్రెస్ అధిష్ఠానం... అతని స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది. అలాగే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మల్లు భట్టి విక్రమార్క నియమితులయ్యారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి గెలుపొందిన మల్లు... 2009 నుంచి 2011 వరకు ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేశారు. అలాగే 2011 నుంచి 2014 ఎన్నికల వరకు డిప్యూటీ స్పీకర్ గా విధులు నిర్వహించారు.

  • Loading...

More Telugu News