: 'బీజేపీ-పీడీపీ'లది అవకాశవాద కూటమి: కాంగ్రెస్
జమ్ము కాశ్మీర్ లో పీడీపీ-బీజేపీ పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుండటంపై కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఆ సంకీర్ణ ప్రభుత్వం ఓ 'అవకాశవాద కూటమి' అని కాంగ్రెస్ నేత పీసీ చాకో వ్యాఖ్యానించారు. అయితే, ఎట్టకేలకు జమ్ము కాశ్మీర్ ప్రజలకు ప్రభుత్వం ఏర్పాటు కానుండటం శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు. కాగా, పీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఫ్తీ మహ్మద్ సయిీద్ ముఖ్యమంత్రిగా మార్చి 1న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. క్యాబినెట్ లో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు చాన్స్ దక్కింది. వారిలోనే ఒకరు ఉపముఖ్యమంత్రిగా ఉంటారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ తొలిసారి పాలుపంచుకుంటోంది.