: తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి


తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపికయ్యారు. ఈ క్రమంలో నిన్నటివరకు ఈ స్థానంలో ఉన్న పొన్నాల లక్ష్మయ్యను కాంగ్రెస్ అధిష్ఠానం తొలగించింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా హుసూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గతంలో రాష్ట్రపతి భవన్ లో ఆర్మీ అధికారిగా ఉత్తమ్ పనిచేశారు. ఈ క్రమంలో తక్షణమే ఢిల్లీకి రావాలని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జానారెడ్డికి పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపువచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ తెలంగాణలో ఉనికి కోల్పోయే పరిస్థితిలో పడింది. అటు పొన్నాల నాయకత్వాన్ని కూడా పలువురు నిరాకరిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కు పీసీసీ బాధ్యతలు అప్పజెప్పారు.

  • Loading...

More Telugu News