: 'స్టార్ ట్రెక్' హీరో లియోనార్డ్ నిమోయ్ కన్నుమూత


హాలీవుడ్ అభిమానులకు 'స్టార్ ట్రెక్' హీరోగా సుపరిచితుడైన లియోనార్డ్ నిమోయ్ కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఊపిరితిత్తుల్లో సమస్యల కారణంగా ఆయన మరణించినట్టు తెలుస్తోంది. 1931లో బోస్టన్ లో జన్మించిన ఆయన చిన్నతనంలోనే నటన బాట పట్టారు. 20 సంవత్సరాల వయసులో సినీ జీవితాన్ని ప్రారంభించారు. 1952లో తొలిసారిగా 'కిడ్ మాంక్ బరోని' చిత్రంలో హీరో పాత్రను పోషించారు. 1965లో 'స్టార్ ట్రెక్' టీవీ సిరీస్ లో నటించడం మొదలుపెట్టిన ఆయన ఆపై 'స్టార్ ట్రెక్' సినిమాల్లో 'మిస్టర్ స్పోక్'గా నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. మొత్తం ఆరు 'స్టార్ ట్రెక్' చిత్రాల్లో ఆయన నటించారు.

  • Loading...

More Telugu News