: రేవంత్ రెడ్డి ఉత్త 'గ్రామ' సింహమే: టీఆర్ఎస్
తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తనను తాను సింహంగా భావించుకుంటున్నారని, కానీ, ఆయన ఓ గ్రామ సింహం మాత్రమేనని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడే వ్యక్తని విమర్శించారు. కరీంనగర్ లో గ్రానైట్ క్వారీల కోసం రేవంత్ రెడ్డి పిచ్చి కుక్కలా తిరిగింది నిజం కాదా? అని ప్రశ్నించారు. అటు, రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.