: కారును రోడ్డుమీద వాష్ చేస్తే ఫైన్!


రోడ్లమీద పగుళ్లు వస్తుండడంతో వాటి మరమ్మతుల కోసం మున్సిపాలిటీలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. వాటిని తగ్గించుకునేందుకు ఉత్తరప్రదేశ్ లోని బరేలీ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. సాధారణంగా వర్షం పడిన తరువాత నీరు రోడ్డుపైన, పక్కన నిల్వ ఉండడంతో పగుళ్లు వస్తున్నాయని గుర్తించిన బరేలీ మున్సిపాలిటీ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో అక్కడి స్థానికుల్లో అత్యధికులు రోడ్లమీదే తమ కార్లను కడుగుతున్నట్టు తేలిందట. నీరు రోడ్డుపక్కన నిలిచిపోయిన కారణంగానే రోడ్లపై పగుళ్లు కనిపిస్తున్నాయని నిర్ధారించింది. దీంతో, బరేలీ మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక, ఎవరైనా రోడ్డుమీద కారును కడిగితే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. తప్పులు మళ్లీ మళ్లీ చేసినా, లేక, చెప్పిన మాట వినకున్నా ఈ జరిమానా పెంచుతామని వారు స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News