: చిక్కుల్లో కేంద్ర మంత్రి గడ్కరీ... బయటపడ్డ విలాసం
విలాసం బయటపడడంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చిక్కుల్లో పడ్డారు. 2013 జూలైలో గడ్కరీ తన భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెతో ఫ్రాన్స్ విహారయాత్రకు వెళ్లారు. ఆ సందర్భంగా ఎస్సార్ కంపెనీకి చెందిన ఓ విలాసవంతమైన పడవలో రెండు రోజులు గడిపారు. ఆ పత్రాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. విహారయాత్ర చేసినప్పుడు ఆయన ఏ పదవిలోనూ లేరు, కనీసం ఎంపీ కూడా కాదు. కానీ ఎస్సార్ యాజమాన్యం ఆయనను ముఖ్యమైన వ్యక్తిగా భావించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. ఆ నాటి ఎస్సార్ కంపెనీ ఆతిథ్యం అందుకున్న వారిలో అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని మంత్రులు, ప్రభుత్వాధికారులు, జర్నలిస్టులు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఆ యాత్రపై వివరాలు కోరుతూ నితిన్ గడ్కరీపై ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. అయితే తానెలాంటి తప్పూ చేయలేదని గడ్కరీ తెలిపారు.