: కడప జిల్లాను సస్యశ్యామలం చేస్తా: చంద్రబాబు
సీఎం చంద్రబాబునాయుడు కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గండికోటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, కడప జిల్లాలో టీడీపీని ఒక్క స్థానంలోనే గెలిపించారని, అయినాగానీ, రాజకీయాలకు అతీతంగా జిల్లాను అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో కరవును నివారిస్తామని చెప్పారు. ఒంటిమిట్టలోనే శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గండికోట నిర్వాసితులను ఆదుకుంటామని, జిల్లాకు సాగు, తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.