: మాటలతో కడుపు నిండదని మోదీ గ్రహించాలి: ఖర్గే
ప్రధాని నరేంద్ర మోదీ మాటల మాంత్రికుడని కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే వ్యంగ్యాస్త్రం సంధించారు. భూసేకరణ అంశంపై లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘోపన్యాసం పూర్తైన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధాని గొప్ప ఉపన్యాసం ఇచ్చారని, ఆయన మాటల గారడీ చేశారని అన్నారు. అయితే మాటలతో కడుపు నిండదన్న విషయం ప్రధాని గుర్తించాలని ఆయన సూచించారు. కాగా, ప్రధాని సుధీర్ఘోపన్యాసంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించిన సంగతి తెలిసిందే. భూసేకరణ చట్టంలో మార్పులు చేసేందుకు 130 సంవత్సరాలు పట్టిందా? అని ఆయన విమర్శించారు. కాగా, భూసేకరణ చట్టంలో మార్పుల పేరుతో పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చాలనే ప్రయత్నంలో, రైతులకు అన్యాయం చేయవద్దని గత కొంత కాలంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.