: క్షమించండి... ఇంకెప్పుడూ ఆ కుర్చీలో కూర్చోను... సుప్రీంకు వెల్లడించిన శ్రీనివాసన్
సుప్రీంకోర్టుకు బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ క్షమాపణలు చెప్పారు. ఇకపై బీసీసీఐ కార్యనిర్వాహక సమావేశాల్లో పాల్గొనబోనని స్పష్టం చేశారు. ఇటీవల చెన్నైలో జరిగిన బీసీసీఐ సమావేశాలకు శ్రీనివాసన్ అధ్యక్షత వహించడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శ్రీనివాసన్ బేషరతు క్షమాపణలు తెలిపినట్టు ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ నేడు కోర్టుకు వివరించారు. వచ్చేనెల 2న జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించబోరని న్యాయమూర్తులు టీ.ఎస్. ఠాకూర్, ఇబ్రహీం కలిఫుల్లాలతో కూడిన ధర్మాసనానికి ఆయన తెలిపారు.