: నవ్యాంధ్ర రాజధాని- గుంటూరు మధ్య మెట్రో రైలు: పార్లమెంటులో ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని- గుంటూరుల మధ్య మెట్రో రైలును ఏర్పాటు చేయాలని టీడీపీ నేత, గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. నేటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా నిన్నటి రైల్వే బడ్జెట్ పై జరిగిన ప్రసంగంలో పాలుపంచుకున్న గల్లా జయదేవ్, నవ్యాంధ్ర రాజధాని అంశాన్ని ప్రస్తావించారు. తుళ్లూరులో నిర్మితమవుతున్న నవ్యాంధ్ర రాజధాని నుంచి గుంటూరు దాకా మెట్రో రైలును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. చిత్తూరు జిల్లాకు చెందిన జయదేవ్ గడచిన ఎన్నికల్లో గుంటూరు నుంచి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News