: క్రిస్ గేల్ క్లీన్ బౌల్డ్... రెండో ఓవర్ లోనే కీలక వికెట్ కోల్పోయిన కరీబియన్లు


409 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టుకు సఫారీలు రెండో ఓవర్ లోనే షాకిచ్చారు. జట్టు స్కోరు 12 పరుగులకు చేరగానే సౌతాఫ్రికా బౌలర్ అబాట్ తన తొలి ఓవర్ మూడో బంతికే కరీబియన్ స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్(3)ను బోల్తా కొట్టించాడు. అబాట్ వేసిన ఆ బంతికి గేల్ క్లీన్ బౌల్డయ్యాడు. నాలుగు బంతులెదుర్కొన్న గేల్ కేవలం 3 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో కరీబియన్లు కష్టాల్లో పడ్డారు. అంతకుముందు సౌతాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ విశ్వరూపం చూపడంతో వెస్టిండీస్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. తాజాగా ఆ జట్టు బౌలర్ల ధాటికి కరీబియన్ జట్టు బ్యాట్స్ మెన్ కూడా పెవిలియన్ కు క్యూ కట్టాల్సిందేనేమో.

  • Loading...

More Telugu News