: భారత్ కు పాక్ ఆర్మీ చీఫ్ హెచ్చరిక
విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ పాకిస్థాన్ పర్యటించనున్న నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ భారత్ ను హెచ్చరించారు. వాస్తవాధీన రేఖ వద్ద ఇండియన్ ఆర్మీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. "గతంలోనూ, ఇటీవలి కాలంలోనూ, సరిహద్దు, వాస్తవాధీన రేఖ వద్ద భారత్ పలుమార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్ ను కలవరానికి గురిచేస్తోంది. దానివల్ల ప్రాంతీయ స్థిరత్వం ప్రభావితమవుతోంది" అని ఓ ప్రకటన చేశారు. సరిహద్దు వద్ద రెచ్చగొట్టే క్రమంలో ఎలాంటి కాల్పులు జరిగినా ప్రతిస్పందన ఘాటుగా ఇస్తామనడంలో సందేహంలేదన్నారు.