: కూతురికి పెళ్లి చేస్తూ కుప్పకూలిన వైకాపా ఎంఎల్ఎ
తన కుమార్తె వివాహ వేడుకలను వైభవంగా నిర్వహిస్తూ, నెల్లూరు రూరల్ ఎంఎల్ఎ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా స్పృహ తప్పి మండపంపైనే కుప్పకూలారు. ఆయనకు స్వల్పంగా గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. అంతవరకూ ఆనందం, ఉత్సాహాల మధ్య ఉన్న కల్యాణమండపం వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారగా, అక్కడే ఉన్న కొందరు వైద్యులు మండపంలోనే అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.