: ఫేస్ బుక్ పోస్టింగులే సాక్ష్యాలు... అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ!


ఇటీవల హైదరాబాదులో సామాజిక ఉద్యమకారిణి సునీతా కృష్ణన్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ దాడిలో ఆమె కారు అద్దాలు ధ్వంసం కాగా, ఆమె మాత్రం తృటిలో అపాయం నుంచి తప్పించుకున్నారు. అసలు సునీతా కృష్ణన్ పై దాడి ఎందుకు జరిగింది? ఇదో పెద్ద కథే కాదండోయ్, కొత్త కథ కూడా. ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కోర్టు బోనులో నిలిపేందుకు నడుం బిగించిన సునీతా కృష్ణన్, సదరు ఘటనకు సంబంధించి నిందితులు షూట్ చూసిన వీడియోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు. విషయం తెలుసుకున్న నిందితులు ఆమెపై దాడికి దిగారు. కథ మొత్తం తెలిసిన హైదరాబాదు పోలీసులు... నిందితుడిపై దాడి కేసు నమోదు చేశారు తప్పించి, అత్యాచారం కేసు పెట్టలేకపోయారు. అయితే సదరు ఫేస్ బుక్ పోస్టింగులను చూసిన సుప్రీంకోర్టు, ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. నేడు దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో కొత్తగా ఏర్పాటైన సోషల్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News