: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా... ఆదిలోనే తొలి వికెట్ డౌన్
వరల్డ్ కప్ లో మరో కీలక మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. గ్రూప్-బీలో అగ్రశ్రేణి జట్టు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తో తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీల ఇన్నింగ్స్ ను హషీమ్ ఆమ్లా, డికాక్ తో కలిసి ప్రారంభించాడు. అయితే ఆరో ఓవర్ లోనే సఫారీ ఓపెనర్ డికాక్ (12) జాసన్ హోల్డింగ్ బౌలింగ్ లో ఓటయ్యాడు. దీంతో ఆదిలోనే సఫారీలకు వెస్టిండీస్ షాకిచ్చినట్లైంది. టీమిండియా చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచి సత్తా చాటాలని సఫారీలు భావిస్తుండగా, జింబాబ్వేతో మ్యాచ్ లో క్రిస్ గేల్ తిరిగి ఫామ్ లోకి రావడంతో రెట్టించిన ఉత్సాహంతో విండీస్ బరిలోకి దిగింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి దక్షిణాఫ్రికా 19 పరుగులు చేసింది.