: కూచిపూడి నాట్యారామం చైర్మన్ గా కూచిభొట్ల ఆనంద్ బాధ్యతల స్వీకరణ


కూచిపూడి నాట్యారామం చైర్మన్ గా ప్రవాసాంధ్రుడు కూచిభొట్ల ఆనంద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిన్న సచివాలయానికి వచ్చిన ఆయన నాట్యారామం చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ లు ఆనంద్ కు అభినందనలు తెలిపారు. సంప్రదాయ నృత్యం కూచిపూడితో పాటు ప్రాచీన కళలను పరిరక్షించుకునే నిమిత్తం కృష్ణా జిల్లా కూచిపూడిని నాట్యారామంగా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, దానికి చైర్మన్ గా కూచిభొట్ల ఆనంద్ ను నియమించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News