: స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ


ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ ను మారిషస్ లోని పోర్ట్ లూయీస్ కోర్టు తిరస్కరించింది. అతనికి బెయిల్ ఇవ్వొద్దని ఏపీ సీఐడీ అభ్యర్థించడంతో కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా అతనిపై నమోదైన అభియోగపత్రాలు, హైకోర్టు తిరస్కరించిన బెయిల్ ఆర్డర్ కాపీని సీఐడీ మారిషస్ కు పంపింది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. నాలుగు రోజుల కిందట మారిషస్ పోలీసులు గంగిరెడ్డిని అరెస్టు చేయడంతో పోర్ట్ లూయి జైలులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News