: ఇందిర, రాజీవ్ ల వల్లే కానిది... జగన్ తో అవుతుందా?: గాలి


వైకాపా అధినేత జగన్ పై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విరుచుకుపడ్డారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్డంగా దోచుకున్న జగన్... ఇప్పుడు టీడీపీని కూలుస్తానంటూ రంగుల కలలు కంటున్నాడంటూ విమర్శించారు. టీడీపీని కూల్చడం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల వల్లే కాలేదని... అలాంటిది జగన్ వల్ల అవుతుందా? అని ప్రశ్నించారు. టీడీపీని ఎన్టీఆర్ ప్రారంభిస్తే, చంద్రబాబు దాన్ని శక్తిమంతం చేశారని గాలి అన్నారు. రంగుల కలలు కనడం మాని, వాస్తవంలోకి రావాలంటూ జగన్ కు సూచించారు.

  • Loading...

More Telugu News