: 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
శ్రీలంకతో మ్యాచ్ లో భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ జట్టు 15.1 ఓవర్లలో 84 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఓపెనర్ తమిమ్ ఇక్బాల్ (0) ను మలింగ తొలి ఓవర్లోనే డకౌట్ చేయగా, ధాటిగా ఆడిన సౌమ్య సర్కార్ (15 బంతుల్లో 25) కొద్ది సేపటి తర్వాత అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మోమినుల్ హక్ (1) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరో ఓపెనర్ అనాముల్ హక్ (29) రనౌటయ్యాడు. ప్రస్తుతం మహ్మదుల్లా, షకిబ్ అల్ హసన్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ నష్టానికి 332 పరుగులు చేసింది.