: కొత్త రైళ్ల ప్రస్తావన లేని బడ్జెట్ దేశ చరిత్రలో ఇదే... కొత్తదనమేమీ లేదన్న సోనియా
నరేంద్ర మోదీ సర్కారు కొద్దసేపటి క్రితం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. భారతీయ రైల్వేల చరిత్రలో కొత్త రైళ్ల ప్రస్తావన లేని బడ్జెట్ ఇదేనని ఆమె ధ్వజమెత్తారు. అసలు బడ్జెట్ లో కొత్తదనమేమీ లేదని ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. పార్లమెంటులో రైల్వే మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించగానే విపక్షాలు, ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశాయి. రైల్వే బడ్జెట్ కు నిరసనగా కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలకు చెందిన సభ్యులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.