: జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరో భారీ అటాచ్ మెంట్
వైకాపా అధినేత జగన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాను ఎదుర్కొంటున్న అక్రమాస్తులు, మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో భారీ అటాచ్ మెంట్ చేసింది. ఇందులో జననీ ఇన్ ఫ్రా, ఇండియా సిమెంట్స్ సంస్థలకు చెందిన స్థలాలను, ఆస్తులను అటాచ్ చేశారు. అటాచ్ మెంట్ అయిన ఆస్తుల విలువ రూ. 232 కోట్లు.