: అవార్డు షో వేదికపై పడిపోయిన మడోన్నా
లండన్ లో జరిగిన 'బ్రిట్' అవార్డు కార్యక్రమంలో పాప్ స్టార్ మడోన్నా ప్రదర్శన ఇచ్చింది. అయితే తన బృందంతో కలసి ప్రదర్శన చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా వేదికపై పడిపోయింది. మళ్లీ వెంటనే సర్దుకుని యథావిధిగా కార్యక్రమం చేసింది. ప్రదర్శన ప్రారంభ సమయంలో మడోన్నా వేదికపై వెనుకగా మెట్లపై నుంచుని ఉంది. ఈ సుందరి పాట పాడుతుండగా వెనుకనుంచి మెడకు కట్టి ఉన్న పొడవాటి వస్త్రంకు తన బృంద సభ్యుడొకరు అడ్డు తగిలారు. దాంతో అమ్మడు పడిపోయింది. దానిపై స్పందించిన మడోన్నా, తాను బాగానే ఉన్నానని తెలిపింది. వెనుక నుంచి తను మెడకు కట్టిన అర్మానీ టైట్ గా ఉండటంతో అలా జరిగిందని చెప్పింది. ఏదీ తనను ఆపలేదని పేర్కొంది.