: వెంకయ్య వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం... స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విపక్షాలు


విపక్ష సభ్యులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడి వ్యాఖ్యలు నేటి పార్లమెంటు సమావేశాల్లో దుమారం లేపాయి. సదరు వ్యాఖ్యలకు వెంకయ్యనాయుడు తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన విపక్షాలు పార్లమెంటులో నిరసనకు దిగాయి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో భేటీ అయిన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, వామపక్షాలు వెంకయ్య వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతేకాక వెంకయ్యనాయుడిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని ఆ పార్టీలు నిర్ణయించాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెనువెంటనే సుమిత్రా మహాజన్ కు వెంకయ్యపై ఫిర్యాదు చేశాయి. వెంకయ్య క్షమాపణలు చెప్పని పక్షంలో రైల్వే బడ్జెట్ ను అడ్డుకోవాలని కూడా విపక్షాలు నిర్ణయించాయి.

  • Loading...

More Telugu News