: వైఎస్ జగన్ తొలి ట్వీట్ ఇదే!


నిన్న ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గురువారం తొలి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలు చేపడుతున్నారంటూ, జగన్ ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ రైతు హత్యలకు కారకులు ఎవరు? మోసం చేసిన చంద్రబాబుదా? విఫలమైన అతని ప్రభుత్వానిదా? గట్టిగా ప్రశ్నించలేకపోయిన సమాజానిదా? అని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు. ఉదయం ఈ ట్వీట్ చేయగా, 9:25 గంటల వరకూ, 150 మందికి పైగా రీట్వీట్ చేశారు. ఆయన ఖాతాను 6,200 మందికి పైగా ఫాలో అవుతున్నారు.

  • Loading...

More Telugu News