: మొయిన్ ఖాన్ కాసినోకు వెళ్లింది జూదం ఆడడానికి కాదట!


భారత్ చేతిలో ఓటమితో పాకిస్థాన్ జట్టు కుదేలైన నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ మొయిన్ ఖాన్ క్రైస్ట్ చర్చ్ లోని ఓ కాసినోకు వెళ్లడం వివాదాస్పదమైంది. దానిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మొయిన్ ను స్వదేశం వచ్చేయాల్సిందిగా ఆదేశించడం తెలిసిందే. దాంతో, ఈ మాజీ వికెట్ కీపర్ ప్రజలకు క్షమాపణలు తెలిపాడు. తాను మిత్రులు, కుటుంబంతో కలిసి కాసినోకు వెళ్లింది డిన్నర్ చేయడానికని వివరణ ఇచ్చాడు. విందు కోసం కాసినోకు వెళ్లడం తప్పేనని అంగీకరించాడు. తన చర్య పాక్ ప్రజలను, క్రికెట్ అభిమానులకు బాధించిందని పేర్కొన్నాడు. మొయిన్ కాసినోకు వెళ్లిన విషయం మీడియాలో రాగానే పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మండిపడ్డారు. దీనిపై విచారణ కమిటీ నియమించారు. అంతేగాకుండా, వెంటనే పాక్ వచ్చి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News