: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురు దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఈ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురున్నారు. శ్రీకాళహస్తి-పిచ్చాటూరు రహదారిపై తిప్పసముద్రం వద్ద ఘటన జరిగింది. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.