: ఆడింది చిన్న జట్లే... కసిగా కలబడ్డాయి!


ఆడింది చిన్న జట్లయినా, ఉత్కంఠకు లోటులేదు. ఐర్లాండ్, యూఏఈ జట్ల మధ్య బ్రిస్బేన్ లో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగింది. మొత్తమ్మీద క్రికెట్ మజాను అందించిన ఈ మ్యాచ్ లో ఐర్లాండ్ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్ 49.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 279 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఐరిష్ బ్యాట్స్ మెన్ పట్టుదల ప్రదర్శించగా, యూఏఈ బౌలర్లు పోరాటపటిమతో ఆకట్టుకున్నారు. ఈ పోరులో చివరకు ఐర్లాండ్ దే పైచేయి అయింది. వికెట్ కీపర్ గారీ విల్సన్ (80), స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ ఓబ్రియాన్ (50), పోర్టర్ ఫీల్డ్ (37), ఎడ్ జాయ్స్ (37), బాల్ బిర్నీ (30) రాణించారు. యూఏఈ బౌలర్ అంజాద్ జావెద్ 3 వికెట్లు తీశాడు. నవీద్, తౌఖీర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గారీ విల్సన్ కు లభించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 278 పరుగులు చేసింది. షాయిమాన్ అన్వర్ (106) సెంచరీతో అలరించాడు.

  • Loading...

More Telugu News