: ఢిల్లీ విద్యుత్ ఛార్జీల్లో 50శాతం తగ్గింపు
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు తొలి కానుక అందించింది.విద్యుత్ ఛార్జీలను 50 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. నెలకు 400 యూనిట్ల వరకు వినిగియోగించుకునే వారికి ఈ తగ్గింపు వర్తించనుంది. దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నెలకు 20,000 లీటర్ల మంచినీరును కూడా ఒక్కో ఇంటికి ఇవ్వబోతుందని తెలుస్తోంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ శిశోడియా మీడియాతో మాట్లాడుతూ, 90 శాతం గృహ వినియోగదారులకు తగ్గించిన విద్యుత్ ఛార్జీలు వర్తిస్తాయని తెలిపారు. 400కంటే ఎక్కువ ఉపయోగిస్తే పూర్తి బిల్లు చెల్లించాలని చెప్పారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు ఆదేశం మార్చి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు.