: 'గ్లోబల్ ఇండియా మ్యూజిక్ అవార్డ్స్'లో రెహ్మాన్ బ్యాండ్ ప్రదర్శన
మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహ్మాన్ కు చెందిన ఎన్ఏఎఫ్ఎస్ బ్యాండ్ తొలిసారిగా 'గ్లోబల్ ఇండియా మ్యూజిక్ అవార్డ్స్' ఐదవ ఎడిషన్ లో ప్రదర్శన ఇవ్వబోతోంది. దీనిపై రెహ్మాన్ సంతోషం వ్యక్తం చేశారు. రేపు సాయంత్రం ముంబయిలో జరగనుంది. గాయకుడు మికా సింగ్, టీవీ హోస్ట్-నటుడు మనీష్ పాల్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. సంగీత, సినీపరిశ్రమ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. పలువురు గాయకులు ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంది.