: కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న యూఏఈ


ఐర్లాండ్ తో మ్యాచ్ లో యూఏఈ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతున్నారు. దీంతో, లక్ష్యఛేదనలో ఐర్లాండ్ జట్టు 25 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. నియాల్ ఓబ్రియాన్ (17 బ్యాటింగ్), ఆండీ బాల్ బిర్నీ(1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఓపెనర్ పోర్టర్ ఫీల్డ్ (37), వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఎడ్ జాయ్స్ (37) భారీ స్కోర్లు సాధించడంలో విఫలమయ్యారు. అంతకుముందు, టాస్ ఓడిన యూఏఈ బ్యాటింగ్ కు దిగింది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ షాయిమాన్ అన్వర్ (106) సెంచరీ సాయంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 278 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News