: ఢిల్లీ రైల్వే స్టేషన్ లో రూ.20 లక్షల విలువ చేసే నకిలీ నోట్లు... ఇద్దరి అరెస్ట్


దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీ బయటపడింది. దాదాపు రూ.20 లక్షల విలువ చేసే నకిలీ నోట్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేసన్ లో తనిఖీలు చేసిన పోలీసులు నకిలీ నోట్లతో పాటు వాటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేందుకు పాకిస్థాన్ లో నకిలీ నోట్లను ముద్రిస్తున్న ఉగ్రవాదులు, బంగ్లాదేశ్ మీదుగా వాటిని భారత్ లోకి చేరవేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News