: గతేడాది బీజేపీకి రూ.157.84 కోట్ల విరాళాలు... 92 శాతం విరాళాలు ఎన్నికలకు కొద్ది ముందుగానేనట!


సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలోని ఆయా రాజకీయ పార్టీలకు విరాళాలు పోటెత్తడం ఏళ్ల తరబడి సాగుతున్నదే. ఇందుకు బీజేపీ కూడా మినహాయింపేమీ కాదు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి ఏకంగా రూ.157.84 కోట్ల మేర విరాళాలందాయట. ఈ విరాళాల్లో 92 శాతం కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే అందాయని అసోసియేషన్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ సంస్థ వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ సమర్పించిన నివేదికను ఆధారం చేసుకునే ఈ మేరకు ఆ సంస్థ ఓ నిర్ధారణకు వచ్చింది. ఇక బీజేపీ చందాదారుల జాబితాలో భారతీ గ్రూపు నేతృత్వంలోని సత్య ఎలక్టోరల్ ట్రస్ట్, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, కెయిర్న్ ఇండియాలు కొత్తగా చేరాయి. సత్య ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.41.73 కోట్లు విరాళమివ్వగా, స్టెరిలైట్ ఇండస్ట్రీస్ రూ.15 కోట్లు, కెయిర్న్ ఇండియా రూ7.5 కోట్ల మేర చందాలిచ్చాయి.

  • Loading...

More Telugu News