: ఇమ్యునిటీ వ్యత్యాసాల్లో మతలబు ఏంటంటే...


'ఇమ్యునిటీ' రోగనిరోధక శక్తి... అనేది ప్రతి ఇద్దరు వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది. సకల రోగాలను తట్టుకోగల.. ఎదురొడ్డి శరీరంపై వాటి ప్రభావం లేకుండా చేయగల శక్తి వీటికే ఉంటుంది. 'ఎందుకలా?' అనడానికి కారణాలు కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కేవలం జన్యువుల్లో తేడానే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. మనుషుల్లోని వివిధ తెగల మధ్య జన్యు నిర్మాణంలో వ్యత్యాసాల వల్లే ఇమ్యునిటీలో కూడా తేడాలు ఉంటున్నాయని తేల్చిచెప్పారు. దీన్ని బట్టి జన్యు ఆధారిత ఔషధాలను రూపొందించే పనిలో పడుతున్నారు.

సాధారణంగా ఇప్పుడు వ్యాధిని బట్టి మనుషులందరికీ ఒకే రకమైన టీకాలు, ఔషధాలు తయారుచేస్తున్నారు. ఇప్పుడు వ్యాధులపై పనిచేసే ఇమ్యునిటీ జన్యువుల్ని బట్టి మారుతుంది గనుక.. ఎవరికి సరిపడే మందులను వారికి తయారుచేసే రోజులు భవిష్యత్తులో రావచ్చునని వీరు అంచనా వేస్తున్నారు. అమెరికాలోని సిమన్‌ ప్రాసెర్‌ యూనివర్సిటీ, మౌంట్‌ సినాయ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ వారు ఈ స్టడీ చేపట్టారు. ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల్లో వివిధ తెగలకు చెందిన వారి జన్యువులను వీరు పరిశీలించారు.

  • Loading...

More Telugu News